ఎస్‌ఐఆర్ విజయవంతానికి రాజకీయ పార్టీల సహకారం కీలకం: రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ హరి చందన

ఆయుధం న్యూస్ హనుమకొండ, ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఎన్నికల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, శక్తి (SHAKTI) శాఖ కార్యదర్శి హరి చందన దాసరి పేర్కొన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్  సత్య శారద, జయశంకర్ భూపాలపల్లి జిల్లా...