హైద‌రాబాద్ ప్రాంతంలోని క్యూర్ ప‌రిధిలో ఎనిమిది వేల ఇందిర‌మ్మ ఇండ్లు

ఆయుధం న్యూస్ హైదార‌బాద్ హైద‌రాబాద్ ప్రాంతంలోని క్యూర్ ప‌రిధిలో తొలి విడ‌త‌గా 16 నియోజ‌వ‌ర్గాల్లో ప్రయోగాత్మ‌కంగా నియోజ‌క‌వ‌ర్గానికి 500 ఇళ్ల చొప్పున‌ ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామ‌ని, త్వ‌ర‌లో మ‌రో 8 నియోజ‌క‌వ‌ర్గాల‌లో కూడా ఈ ప‌ధ‌కం అమ‌లు చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. పేద‌వాడి సొంతింటి క‌ల నెర‌వేరేవ‌ర‌కు ఇందిర‌మ్మ ఇళ్ల య‌జ్ఞం కొన‌సాగుతుంద‌ని, చివ‌రి ల‌బ్దిదారునికి ఇల్లు అందేవ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని , ఇది నిరంత‌ర ప్ర‌క్రియ అని పేర్కొన్నారు.సోమ‌వారం నాడు స‌చివాల‌యంలో...