AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 4:14 pm Posted by : AYUDAM DAILY

కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రెండు రోజుల పర్యటన

ఆయుధం న్యూస్ హైదరాబాద్ :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 21నుండి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు.రాత్రి కొడంగల్‌లో బసచేసి మరుసటి రోజు (22వ తేదీన) నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. SIR కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు