భ‌ద్ర‌కాళ మాత జ్ఞానశక్తిని శివదూతీమాత భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్ వరంగల్ మహానగరంలో పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్ర మహోూత్సవములు ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం నిత్యాహ్నికం పూర్తిచేసిన పిమ్మట అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్చాశక్తిని కాళీ క్రమాన్ని అనుసరించి ఉగ్రా నిత్యా గాను షోడశీ క్రమాన్ని అనుసరించి జ్ఞానశక్తిని శివదూతీమాతగాను అలంకరించి పూజారాధనలు నిర్వహించారు. ఏతిథికి ఏదేవత అధిదేవతో ఆదేవతను ఆరాధించడం వల్ల ఆరోజంతా శుభప్రదమౌతుందని జ్యోతిశ్శాస్త్రం చెప్పడం వల్ల మంగళవారం కావడం వల్ల భక్తులందరికీ ఈ రోజు శుభప్రదం కావాలని ఆలయంలో అర్చకులు...