వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఆయుధం న్యూస్ హన్మకొండ: రాష్ట్రంలో ఎల్‌నీనో ప్రభావంతో సాధారణం కంటే వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్...