AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 1:18 pm Posted by : AYUDAM DAILY

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖకు ఘన స్వాగతం

ఆయుధం న్యూస్ హనుమకొండ: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ పర్యటన నిమిత్తం వరంగల్ ఎన్ఐటి గెస్ట్ హౌస్ వద్దకు చేరుకోగా వారికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు బుధవారం ఘనంగా స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలకు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కెఆర్ నాగరాజు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, తదితరులు పుష్ప గుచ్ఛాలు, పూలమొక్కలను అందించి ఘన స్వాగతం పలికారు.ఎన్ఐటీ గెస్ట్ హౌజ్ కు చేరుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కొద్దిసేపు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డిసీపీ దార కవిత, జిల్లా అదనపు కలెక్టర్ రవి, డీఆర్వో శ్రీనివాస్, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.