ఆయుధం న్యూస్ విజయవాడ
ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ , ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి రెండవ విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా కన్వీనర్, విజయవాడ ప్రభుత్వ ఐటీఐ ప్రధాన అధికారి ఎం. కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు.
పదో తరగతి లేదా 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. అర్హులైన అభ్యర్థులు itiadmissions.ap.gov.in/iti వెబ్‌సైట్ ద్వారా గానీ, నేరుగా ప్రభుత్వ ఐటీఐకి వచ్చి గానీ ఆగస్టు 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేయాలని సూచించారు.
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తులు నింపేటప్పుడు తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడాలని, వెరిఫికేషన్ సమయంలో వివరాలు సరిగా లేకపోతే అడ్మిషన్‌కు అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు. ఆన్‌లైన్ అప్లికేషన్ దాఖలు చేయడంలో సహాయం కోసం విజయవాడ ప్రభుత్వ ఐటీఐ నందు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు విజయవాడలోని జిల్లా కన్వీనర్ కార్యాలయాన్ని నేరుగా గానీ లేదా 94906 39639 ఫోన్ నెంబర్ ద్వారా గానీ సంప్రదించాలని కోరారు.