రైతు కష్టానికి అండగా కూట‌మి ప్రభుత్వం

అమ‌రావ‌తి: రాష్ట్రంలోని పొగాకు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధ‌వారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రెండు రోజులు ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్‌, ల‌ల‌న్ సింగ్ , శివ‌రాజ్ సింగ్ చౌహ‌న్ ల‌తో విస్తృతంగా చర్చలు జరిపామని,...