AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 6:31 pm Posted by : AYUDAM DAILY

భీమదేవరపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా క‌లెక్ట‌ర్ తనిఖీ

ఆయుధం న్యూస్ హనుమకొండ
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర రోడ్డులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలోని వంటశాల (కిచెన్), తాగునీటి సౌకర్యాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై అధికారులను ఆరా తీశారు. విద్యార్థుల‌కు అందుతున్న విద్య, వసతి, ఆహారం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై బాలిక‌ల‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.పాఠశాలలో పరిశుభ్రత, ఆహార నాణ్యత, విద్యార్థినుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.ఈ తనిఖీలో తహశీల్దార్ రాజేష్,ఎంఈఓ సునీతారాణి, ఎంపీడీఓ వీరేశం, కేజీబీవీ ప్రత్యేకాధికారి జ్యోతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.