భీమదేవరపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా క‌లెక్ట‌ర్ తనిఖీ

ఆయుధం న్యూస్ హనుమకొండ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర రోడ్డులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలోని వంటశాల (కిచెన్), తాగునీటి సౌకర్యాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై అధికారులను ఆరా తీశారు. విద్యార్థుల‌కు అందుతున్న విద్య, వసతి, ఆహారం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై బాలిక‌ల‌ను వివరాలు...