అమెరికాలో ఉన్నా మనసంతా తెలంగాణ అన్నదాతలపైనే
ఆయుధం న్యూస్ ములుగు అమెరికా తెలంగాణ అసోసియేషన్ (TTA) సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అక్కడ ఉన్నప్పటికీ తన మనసంతా తెలంగాణ రైతులపైనే ఉందని మరోసారి చాటిచెప్పారు.తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, సాగు పరిస్థితులపై ములుగు రైతులతో మంత్రి సీతక్క ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, చెరువుల పరిస్థితి, విత్తనాల విత్తకం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు.రైతులతో మాట్లాడిన...