AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 7:29 pm Posted by : AYUDAM DAILY

రెండువంద‌ల ఎకరాలు ఆయిల్ ఫామ్ పంట సాగుచేస్తే ఆ ఉరికి 5 లక్షల రూపాయలు

ఆయుధం న్యూస్ హన్మకొండ
కరువు తీవ్రత ఉంటే తాగునీరు, సాగునీరు, పశుగ్రాసం పై తీవ్ర ప్రభావం పడుతుందని,ఈ ప్రభావం నుండి కొంత తట్టుకోవాలంటే రైతులు మొక్కజొన్న, పప్పుదినుసులు ముఖ్యంగా కందులు, చిరుధాన్యం తదితర ఆరుతడి పంటలు పండించేల అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్ర‌భ‌క‌ర్ సూచించారు.హుస్నాబాద్ దగ్గరలోనే నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉంది. కాబట్టి రైతులతో తక్కువ నీటితో పండించే ఆయిల్ ఫామ్ పంట వేయించాలని ఒక ఊరిలో 100 నుంచి 200 ఎకరాలు ఆయిల్ ఫామ్ పంట వేయిస్తే ఆ ఉరిఅభ‌వృద్దికి 5 లక్షల రూపాయల అందిస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు.గురువారం హుస్నాబాద్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్ కాంప్లెక్స్ లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని మండలాలలో ఎల్ నినో ప్రభావం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సిద్దిపేట, కరీంనగర్ , హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇంకుడు గుంతలను కూడా విరివిగా చేపట్టాలి.

హుస్నాబాద్ పీఠభూమి ప్రాంతం ఇక్కడ మామలు సమయాల్లోనే వర్షాలు ఇబ్బందులు ఉంటాయి..అయితే ఈసారి ఎల్ నినో నేపద్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా జిల్లాలో అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకునేలా సమావేశం ఏర్పాటు చేశామ‌ని.సమస్య రాకముందే ఏం చేయాలనేదనిపై దిశా నిర్దేశం చేయడం జరిగఉతుంద‌ని వచ్చే జూన్ వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు..ఇప్పటికే ఈ విపత్తు పై అన్ని జిల్లాల్లో ఇంచార్జి మంత్రుల ద్వారా సమీక్షలు చేసుకోవడం జరిగింది…ప్రతి డిపార్ట్మెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకోవాలిఎల్ నినో పై ప్రజలను అప్రమత్తం చేయడానికి నియోజకవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ లలో ఆక్టివ్ కలెక్టర్లు ఉన్నారు. ఎల్ నినో పరిస్థితిని సమర్థవంతంగా పర్యవేక్షించాలని కొరారు. వర్షాభావ ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటాయని VBG RAMG పథకం ద్వారా ఇంకుడు గుంతలు తప్పక త్రవ్వించాలని రైతులకు అర్థమయ్యేలా వర్షాభావ పరిస్థితులను సైంటిఫికంగా చెప్పాలని వ్యవసాయ శాఖ ఆధ్వ‌ర్యంలో ఎల్ నినో ప్రభావంను దృష్టిలో పెట్టుకొని పండించాల్సిన పంటలగురించి రూపొందించిన కరపత్రాలను రైతులకు అందించి వివరించాలని అధికారుల‌ను ఆదేశించారు..
మూడు జిల్లాలలో త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తుగా అందుబాటులో ఉన్నా నీటివనరులను సద్వినియోగం చేసుకొని ప్రణాళిక బద్దంగా త్రాగునీటి సరఫరా చెయ్యాలని.త్రాగునీరు వృధా కాకుండా పర్యవేక్షణ చెయ్యాలని
ఎల్ఎండి నుండి నియోజకవర్గానికి నిరంతరాయంగా త్రాగునీటిని సరఫరా చెయ్యాల‌ని అన్నారు.
గ్రౌండ్ వాటర్ లెవెల్ వివరాలను ప్రతీ వారం రోజుల కొకసారి న‌మోదుచేసి వివ‌రాల‌ను ప్ర‌భుత్వంకు అంద‌చేయాల‌న్నారు..మండలాల వారిగా పాడిపశువులను పెంచుకోవడానికి అర్హత ఉన్న రైతులనుండి దరఖాస్తును స్వీకరించి జాబితాను అందిస్తే అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి పాడిపశువుల యూనిట్లు అందేలా చూస్తామ‌ని విబిజి రామ్ జీ పథకం,తెలంగాణ జలసిరి పథకాల ద్వారా ఫాంపాండ్స్ నిర్మాణం చేసి నీటి సంరక్షణ చేపట్టి భూగర్భ జలాలను పెంచుతూ రైతులకు ఆ నీటితో లబ్దికలిగేలా పనులు చేపట్టాలి అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు.

స్టీల్ బ్యాంక్ విజ‌య‌వంతం..
హుస్నాబాద్ ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మార్చడానికి గత ఏడాది గవర్నర్ స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు..
విజయవంతంగా అమలు జరుగుతుంది ప్రతి గ్రామంలో 13 రకాల వస్తువులతో 300,400,500 వస్తువులు ఇవ్వడం జరిగిందని 300కి పైగా హోటల్స్ కి స్టీల్ గ్లాస్ అందించడం జరిగింది. ఎక్కడ ప్లాస్టిక్ లు వాడకుండా చర్యలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు.

ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ

ఎల్ నినో ప్రభావం కారణంగా హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఎల్ నినో తీవ్రత కారణంగా సాగునీరు, తాగునీరు పై అత్యంత ప్రభావం చూపుతుందన్నారు. తద్వారా రైతులను వరి, పత్తి పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రైతు వేదికల ద్వారా రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో మెట్ట పంటల సాగు గురించిన ప్రాధాన్యతను వివరించామని తెలిపారు. అన్ని విభాగాల అధికారులతో ప్రతి గ్రామపంచాయతీలో రైతు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎల్ నినో ప్రభావం కారణంగా రైతులు కందులు, కూరగాయ పంటలు సాగు చేసుకునే విధంగా అనుకూలంగా ఉంటుందని, ఇందుకు సరిపడా కందులు, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో తాగునీటికి సంబంధించి ఎల్ఎండి, ధర్మసాగర్ రిజర్వాయర్, చలి వాగులలో ఎంత నీటిమట్టం ఉందని పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. కంటింజెన్సీ ప్రణాళిక తో మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ద్వారా ప్రతి గ్రామము/ ఆవాసాలకు తాగునీరు అందే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో బావులను అద్దెకు తీసుకుని ప్రతి గ్రామపంచాయతీ ఆవాసానికి తాగునీరును ట్యాంకర్ల ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా జలసిరి కార్యక్రమం కింద చేపట్టే పనులతో నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టడంలో దేశంలోనే టాప్ టెన్ లో గ్రేటర్ వరంగల్ నగరం ఉందని తెలిపారు. జిల్లాలో నీటి సంరక్షణ చర్యలలో భాగంగా ముఖ్యంగా ఫామ్ పాండ్స్, పిట్స్ నిర్మాణాలను చేపడుతున్నట్లు చెప్పారు. ఎల్కతుర్తి, గోపాలపూర్ లో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించి అందజేయనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావం, కాంటిన్జెన్సీ ప్రణాళికల గురించి ప్రణాళిక, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, భూగర్భ జల వనరులు, డీఆర్డీవో, విద్యుత్, తదితర శాఖల జిల్లా అధికారులు సత్యనారాయణ రెడ్డి, ఆదిరెడ్డి, కమలాకర్ రెడ్డి, డాక్టర్ రాధా కిషన్, రవీందర్, మేన శ్రీను, సామ్య నాయక్ ఆయా శాఖల గురించిన వివరాలను మంత్రికి వివరించారు.

సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ:-
ఇలాంటి ఎల్ నినో క్రిటికల్ పరిస్థితిని రైతులకు అవగాహన కల్పిస్తూ, వరి సాగును తగ్గించి ఆరుతడి పంటలు పండించేలా మోటివేట్ చేస్తూ వ్యవసాయ శాఖ ద్వారా కంటింజెన్స్ నివేదికలు సిద్ధం చేశామని.వాటిని క్షేత్రస్థాయిలో అమలుచేస్తాము.రైతువేదికల ద్వారా అవగాహన కల్పించామని ఆదర్శ గ్రామ సర్పంచి, రైతులు, గ్రామ పెద్దల సమక్షంలో రైతులతో సమావేశాలు నిర్వహించి మోటివేట్ చేస్తున్నామని పాడిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ
పంటల మార్పిడిని ప్రోత్సహిస్తూ రైతు వేదికల ద్వారా రైతులను చైతన్యవంతం చేస్తున్నాం.ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి వ్యవసాయ ఉద్యానవనం శాఖల ద్వారా విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించాము.మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారుల సమన్వయంతో
త్రాగునీటి సమస్య రాకుండా మండల లెవెల్ ప్రణాళిక బద్దంగా చర్యలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్తక, రెవెన్యూ, మున్సిపల్, గ్రామీణ అభివృద్ధి, ఇరిగేషన్, మిషన్ భగీరథ, గ్రౌండ్ వాటర్, పంచాయతీ రాజ్, ప్రణాళిక, విద్యుత్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.