సమాజ రుగ్మతలపై అక్షరాయుధం జాషువా రచనలు
ఆయుధం న్యూస్ పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లోని అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్ గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రత్న మాణిక్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం మాట్లాడుతూ,సమాజంలో నెలకొన్న అంటరానితనం,కుల వివక్ష వంటి సామాజిక రుగ్మతలపై గుర్రం జాషువా తన కలంతో అక్షర...