విత్తన మేళాలను సద్వినియోగం చేసుకొని నాణ్యమైన విత్తనాలను వినియోగించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఆయుధం న్యూస్ వరంగల్ ఖరీఫ్ సీజన్‌లో రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద సూచించారు. వ‌రంగ‌ల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను జిల్లా కలెక్టర్ సోమ‌వారం నాడు ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ రకాల విత్తనాల స్టాళ్లను సందర్శించి, వాటి నాణ్యత, అందుబాటు, వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు గుర్తింపు పొందిన సంస్థల ద్వారా సరఫరా...