విద్యార్థులను చదవడం, రాయడంలో ఉత్తమంగా ఉండేలా తీర్చిదిద్దాలి

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌ విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా, చదవడం, రాయడం, భావవ్యక్తీకరణలో మెరుగైన నైపుణ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.గురువారం హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల కుమారిని కలెక్టర్ పాఠశాలలో ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రస్తుత విద్యా సంవత్సరంలో...