పారదర్శకంగా, పకడ్బందీగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ

ఆయుధం న్యూస్ హనుమకొండ: హ‌నుమ‌కొండ‌ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–Special Intensive Revision) ప్రక్రియ అధికారులు, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారంతో విజయవంతంగా కొనసాగుతోందని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి తెలిపారు.శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై అధికారులతో పాటు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పురోగతిని...