ఓరుగల్లు గడ్డపై మేయర్ పీఠమే లక్ష్యం మున్సిపల్ ఎన్నికలపై వరంగల్ బీజేపీ స్పెషల్ ఫోకస్..
ఆయుధం న్యూస్ వరంగల్ ఓరుగల్లు గడ్డపై రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు నడుం బిగించాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పిలుపునిచ్చారు.శనివారం ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల కార్య నిర్వహణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ , రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు...