వెల్ నెస్ సెంటర్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలి

ఆయుధం న్యూస్ హనుమకొండ: వెల్ నెస్ సెంటర్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎన్. రవి అన్నారు.సోమవారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల పక్కన ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్లకు వైద్య సేవలను అందించే వెల్ నెస్ సెంటర్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెల్ నెస్ సెంటర్ లోని జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెంటల్, కంటి విభాగం, ల్యాబ్, ఫార్మసీ, ఓపీ విభాగాలను పరిశీలించారు. ఎంతమంది వైద్యులు, సిబ్బంది విధులకు హాజరయ్యారని...