శిశువులకు తొలి రక్షణ తల్లిపాలే
ఆయుధం న్యూస్ హనుమకొండ: శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి, ఎదుగుదలకు తల్లిపాలే అత్యుత్తమ ఆహారమని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి అన్నారు. ప్రతి తల్లి తన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, శిశువులకు సమయానుకూలంగా తల్లిపాలు అందించాలని సూచించారు.ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం హనుమకొండ గోపాల్‌పూర్‌లోని ఎంపీపీఎస్ ప్రాంగణంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన అన్నప్రాశన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు తన చేతుల మీదుగా అన్నప్రాశనం చేయించి ఆశీర్వదించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ,...