కాకతీయ వైభవానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేయాలి: వరంగల్ ఎంపీ కడియం కావ్య
ఆయుధం న్యూస్ హన్మకొండ వరంగల్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన కాకతీయ వారసత్వ పరిరక్షణ, అభివృద్ధి అంశాన్ని లోక్‌సభ వేదికగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య బలంగా ప్రశ్నించారు. కాకతీయుల చరిత్ర, సంస్కృతి, కళా వైభవం కేవలం తెలంగాణకే కాకుండా దేశానికి గర్వకారణమని, అలాంటి వారసత్వ సంపదకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.ప్రధానంగా వరంగల్‌కు చరిత్రక గుర్తింపుగా నిలిచిన కాకతీయ కట్టడాలు, సంప్రదాయ కళలు, చేనేత–హస్తకళలు, సాంస్కృతిక ఉత్సవాలు, పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లలో...