కనకదుర్గమ్మకు కాసుల హారం. 17 లక్షల విలువైన బంగారాన్ని అందించిన భక్తులు
ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ దుర్గమ్మకు భక్తులు లక్ష్మీ కాసుల హారాన్ని సోమవారం సమర్పించారు. భక్తులు దొండేటి ఐశ్వర్య జ్యోతి, కుటుంబ సభ్యులు అమ్మవారికి 108 గ్రాముల బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని బహూకరించారు.లక్ష్మీ కాసుల హారం విలువ రూ. 17 లక్షలు విలువ చేస్తుందని దాతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు దాతల కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరానికి చెందిన భక్తులు దుర్గమ్మకు ఆదివారం బంగారపు నత్తు, బొట్టు, బొల్లాకిని కానుకగా సమర్పించారు. విజయనగరం జిల్లా గాజులరేగడకు చెందిన...