ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్
ఆయుధం న్యూస్ హనుమకొండ: ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయించాలని హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి అన్నారు.మంగళవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని లక్ష్మి ఫర్టిలైజర్ దుకాణాన్ని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా డిఏపి, ఇతర ఎరువుల నిల్వలను షాపు యజమాని తిరుపతిని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఫర్టిలైజర్ షాప్ కు ఎక్కడినుండి ఎరువులు విత్తనాలు వస్తుంటాయనే సమాచారాన్ని ఆరా తీశారు. ఇప్పటివరకు ఎన్ని యూరియా బస్తాలు విక్రయించారని, వాటికి...