తుర్క కాషా సమాజానికి జనరేటర్లు, టూల్ కిట్ల పంపిణీ
ఆయుధం న్యూస్ వనపర్తి తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ ప్రభుత్వరంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) చైర్మన్ మహ్మద్ ఒబేదుల్లా కోత్వాల్ గారితో కలిసి వనపర్తి జిల్లా కొత్తకోట నియోజకవర్గంలో "మైనారిటీ తుర్క కాషా కమ్యూనిటీ పునరావాస పథకం" కింద తుర్క కాషా ముస్లిం సమాజానికి జనరేటర్లు మరియు టూల్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...