ఆయుధం న్యూస్ హైదరాబాద్
విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో చేపలను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని,ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ ద్వారా ఆన్‌లైన్ చేపల విక్రయాలకు అవకాశం కల్పిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్య రంగ అభివృద్ధిపై జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో మంత్రి వాకిటి శ్రీహరి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 26 వేల చెరువులు, 100 రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని విస్తరించడంతో పాటు ఇన్సూరెన్స్, మోపెడ్‌లు, రిటైల్ ఫిష్ అవుట్‌లెట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని, ఉచిత చేప పిల్లల పంపిణీ కొనసాగింపుతో పాటు పెండింగ్ బకాయిల విడుదలకు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో చేపలను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, కోహెడలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ ద్వారా ఆన్‌లైన్ చేపల విక్రయాలకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. సభ్యత్వ వివాదాల పరిష్కారం, .1.34 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల చెల్లింపు వంటి అంశాలను ప్రస్తావిస్తూ మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.