ప్లానిటోరియం అక్టోబర్ 2 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి
ఆయుధం న్యూస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ ఆవరణలో చేపడుతున్న ప్లానిటోరియం పునరుద్ధరణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.మంగళవారం కమిషనర్ ప్లానిటోరియం అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులను పరిశీలించి, మిగిలిన పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్లానిటోరియం డోమ్ నిర్మాణానికి సంబంధించిన...