స్టేషన్ ఘన్‌పూర్ లో మెగా లెదర్ పార్క్‌కు కేంద్రం ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి: వరంగల్ ఎంపీ కావ్య
ఆయుధం న్యూస్ న్యూ డిల్లీ జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రతిపాదించిన మెగా లెదర్ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలపాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య కోరారు. బుధవారం లోక్‌సభలో రూల్-377 కింద ఈ అంశాన్ని ప్రస్తావించిన ఎంపీ, తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదన చాలా కాలంగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండడంతో ఉపాధి కల్పనకు దోహదపడే కీలక ప్రాజెక్టు ఆలస్యమవుతోందని పేర్కొన్నారు.స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రభుత్వ గుర్తించిన 120 ఎకరాల్లో తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ (టీఎస్‌ఎల్‌ఐపీసీఓ)...