వైరల్ హెపటైటిస్ నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి

ఆయుధం న్యూస్ వరంగల్ జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమం (NVHCP) అమలులో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన గురువారం జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, హై-రిస్క్ గ్రూపులకు హెపటైటిస్-బి (Hepatitis-B) వ్యాక్సినేషన్‌ను పూర్తి స్థాయిలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే హెపటైటిస్-ఎ (Hepatitis-A), హెపటైటిస్-ఈ (Hepatitis-E) వ్యాప్తిని నివారించేందుకు తాగునీటి వనరుల క్లోరినేషన్‌ను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.హెపటైటిస్ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, రక్తదాతలకు...