భూముల రీ సర్వేను మరింత వేగవంతం చేయాలహలి

హనుమకొండ జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ సర్వేను మరింత వేగవంతం చేయాలని భూములు కొలతల శాఖ అధికారులు, సర్వేయర్లను హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి ఆదేశించారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ చాంబర్ లో భూముల రీసర్వే పురోగతిపై భూములు కొలతలు శాఖ అధికారులు, సర్వేయర్లు, లైసెన్సుడ్ సర్వేయర్లతో ఇన్చార్జి కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని 9 మండలాల్లో కొనసాగుతున్న భూముల రీ సర్వే ఎంతవరకు పూర్తయిందనే వివరాలను భూములు కొలతలు శాఖ...