AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 5:18 pm Posted by : AYUDAM DAILY

16న ప‌ర‌కాల‌కు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ఆయుధం న్యూస్ ప‌ర‌కాల‌
హ‌న్మ‌కొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఆగస్టు 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ .ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన డిగ్రీ కళాశాల, పరకాల ఇందిరా మహిళా డైరీ, ఏటీసీ సెంటర్, తదితర పనులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయనున్నారని అన్నారు.