డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

ఆయుధం న్యూస్ హనుమకొండ హ‌న్మ‌కొండ జిల్లా కమలాపూర్ మండలంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎన్. రవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెం గ్రామాలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల సముదాయంలో ప్రస్తుతం ఉన్న వసతులు, ఇళ్ల పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇళ్ల ప్రారంభోత్సవం, అర్హులైన లబ్ధిదారులకు కేటాయింపు, ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు ఇన్ఛార్జి...