పార్లమెంట్ లో మ్యాగీ నూడిల్స్‌లా రెండు మూడు నిమిషాల్లో బిల్లులు పాస్‌ చేస్తున్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య

ఆయుధం న్యూస్ జ‌న‌గామ‌ దేశంలో కాంగ్రెస్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని వరంగల్‌ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ భూస్థాపితం కావడం ఖాయమని, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యమని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ, పట్టణ, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవానికి శనివారం వరంగల్ ఎంపీ కడియం కావ్య...