AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 6:10 pm Posted by : AYUDAM DAILY

ఇక నుండి ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే అంటే…….

ఆయుధం న్యూస్ హైద‌రాబాద్
హైదరాబాద్ నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఆగస్టు 11 నుంచి 21వ తేదీ వరకు చేపట్టనున్న స్పెషల్ మాన్సూన్ డ్రైవ్‌లో భాగంగా దోమల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మినిస్టర్ క్వార్టర్స్‌లో IEC కార్యక్రమాన్ని రాష్ట్ర ర‌వాణ బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్రారంభించారు ఈ సందర్భంగా దోమల నివారణకు ఎంటమాలజీ విభాగం ఉపయోగిస్తున్న వివిధ పరికరాలను పరిశీలించి, వాటి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

దోమల నివారణకు విస్తృత చర్యలు

దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామ‌ని ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమం నిర్వహిస్తున్నామ‌ని. ఇంటింటికీ వెళ్లి నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించాని అధికారుల‌కు సూచించారు,
దోమల లార్వాలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్స్ నిర్వహించాలని.జీహెచ్‌ఎంసీ పరిధిలో విస్తృతంగా ఫాగింగ్ చేపడుతున్నాట్లు తెలిపారు..దోమల నివారణపై కరపత్రాల ద్వారా అవగాహన పాఠశాలల్లో విద్యార్థులకు దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల‌ని. వర్షాల కారణంగా నిల్వ ఉన్న నీటిని తొలగించేలా ప్రజలకు సూచనలు చేశారు..

ప్రజలు స్వీయ బాధ్యతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

హైదరాబాద్ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జీహెచ్‌ఎంసీ ద్వారా ఇంటింటికీ వెళ్లి పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణపై అవగాహన కల్పిస్తున్నాం.ప్రజలందరూ స్వీయ బాధ్యతతో తమ ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమంలో భాగంగా ఇళ్లలో, పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి దోమల లార్వాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు తమ ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే హైదరాబాద్‌ను ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దగలం. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమని అన్నారు.జీహెచ్‌ఎంసీ చేస్తున్న విజ్ఞప్తిని ప్రతి ఒక్కరూ పాటించి దోమల నివారణలో భాగస్వాములు కావాలని కోరారు.