బీసీలను గండెల్లో పెట్టుకుంటున్నాం: బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
ఆయుధం న్యూస్ విజయవాడ : ఆంద్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల నుంచి ఏపీలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు శ్రమిస్తుంటే, అధికారం కోసం తన క్రిమినల్ బ్యాచ్ తో జగన్ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. సొంత పార్టీ కార్యకర్తలను సైతం బలిపెడుతున్న నేరగాళ్ల ముఠా వైసీపీ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైసీపీని పునాదులతో సహా భూస్థాపితం చేయాలని ప్రజలకు మంత్రి...