ముప్పారం గ్రామ సభలో చేయూత పెన్షన్ దరఖాస్తులు స్వీకరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి..
ఆయుధం న్యూస్ ధర్మసాగర్ ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణపై ఏర్పాటు చేసిన గ్రామ సభలో , స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. చేయూత పెన్షన్ దరఖాస్తుదారులుదరఖాస్తు చేసుకోవాల్సిన విధానం, అందుకు సంబంధించిన విధివిధానాలపై స్థానిక సర్పంచ్ గుంటిపల్లి రేణుక, గ్రామ నాయకులతో చర్చించారు. ఈ సందర్బంగా జిల్లాలోనే మొట్ట మొదటి చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణనను ఆయనప్రారంభించారు. చేయూత పెన్షన్ ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలకు వంద శాతం మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు....