తెలంగాణ‌లో రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి 600 కోట్ల రూపాయ‌లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌ పేదల సంక్షేమం, రైతుల భూ హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని తెలిపారు.సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి 3.25 కోట్ల రూపాయ‌ల‌ అంచనా...