తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురవాలని వ‌రుణ‌ యాగాం పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దంప‌తులు

ఆయుధం న్యూస్ నల్లగొండ‌ తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను వేడుకుంటూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జునసాగర్‌లోని విజయ్ విహారం వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ పవిత్ర వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమగుండాలతో వరుణదేవుని అనుగ్రహాన్ని...