ఆగస్టు 12 నుండి ఇంటెన్సిఫైడ్ ఐసిటిసి క్యాంపెయిన్-2026 ప్రారంభం

ఆయుధం న్యూస్ విజ‌య‌వాడ‌ ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ, అవగాహన 95-95-99 లక్ష్యాల సాధన దిశగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మార్గదర్శకత్వంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీఎస్ఎసిఎస్) ఆధ్వర్యంలో ఆగస్టు 12 నుండి నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా "ఇంటెన్సిఫైడ్ ఐసిటిసి క్యాంపెయిన్-2026" నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్ఎసిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. స్మరణ్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాడేపల్లి కార్యాలయం నుండి ఈ కార్యక్రమ వివరాలను వెల్లడిస్తూ, అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని...