ఆగస్టు 15లోగా ఒక యూనిఫామ్, 30లోగా మరో యూనిఫామ్ అందించాలి:
ఆయుధం న్యూస్ హనుమకొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే యూనిఫామ్‌ల తయారీలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను, మహిళా సంఘాల ప్రతినిధులను ఆదేశించారు.మంగళవారం పరకాల మండలం నాగారం గ్రామంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు కేటాయించిన పాఠశాల యూనిఫామ్‌ల కుట్టు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఎన్ని యూనిఫామ్‌లు కుట్టారు, వస్త్రం నాణ్యత ఎలా ఉంది, కుట్టు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది తదితర వివరాలను మహిళా సంఘాల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు....