ఘనంగా చౌడేశ్వరి అమ్మవారి బోనాల పండుగ
ఆయుధం న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి సందర్భంగా చౌడేశ్వరి అమ్మవారి బోనాల పండుగను ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి సవిత పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలపై, నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి సవిత ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని...