హెచ్‌ఐవి నివారణపై అవగాహన పెంపొందించాలి: కలెక్టర్‌ సత్య శారద

ఆయుధం న్యూస్ వరంగల్ : హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వరంగల్ జిల్లాలో రెండు నెలల ఇంటెన్సిఫైడ్‌ ఐఈసీ క్యాంపెయిన్‌ను బుధవారం ప్రారంభించారు. ఎంజీఎం హాస్పిటల్‌ అకాడమిక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సత్య శారద పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూహెచ్‌ఐవి వ్యాప్తి మార్గాలు, నివారణ పద్ధతులు, ముందస్తు పరీక్షలు, చికిత్స సేవలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. ఆగస్టు 12 నుంచి అక్టోబర్‌ 12...