హరే కృష్ణ కిచెన్‌లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలి

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్: పేద, మధ్యతరగతి ప్రజలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందిస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాలకు ఆహారాన్ని సరఫరా చేసే హరే కృష్ణ ఫౌండేషన్ ప్రధాన వంటశాలలో అత్యున్నత పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న నిర్వాహకులను ఆదేశించారు.బుధవారం వరంగల్ నగరంలోని ఎనుమాముల ప్రాంతంలో ఉన్న హరే కృష్ణ ఫౌండేషన్ ప్రధాన వంటశాలను, అనంతరం నూతనంగా నిర్మించిన వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ...