ఇజ్రాయెల్ పట్టణ నీటి నిర్వహణ విధానాలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయ్
ఆయుధం న్యూస్ హనుమకొండ, పట్టణాల్లో నీటి భద్రతను బలోపేతం చేయడంతో పాటు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న విధానాలు, సమర్థవంతమైన పాలనా వ్యవస్థలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయ్ తెలిపారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 8వ తేదీ వరకు ఇజ్రాయెల్‌లోని వివిధ నగరాల్లో అర్బన్ వాటర్ మేనేజ్‌మెంట్‌పై నిర్వహించిన అధ్యయన పర్యటనలో కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయ్ పాల్గొన్నారు. ఈ...