కేటాయించిన ఇళ్లలో వెంటనే నివసించాలి : కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
ఆయ/ధం న్యూస్ హన్మకొండ నిరుపేద కుటుంబాలకు సొంత ఇళ్లు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో వెంటనే నివసించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు.శాయంపేటలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల బ్లాక్‌లను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా బ్లాక్‌లను సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఇప్పటివరకు ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే తమకు కేటాయించిన ఇళ్లలో నివసించాలని కోరారు. ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు...