ఎం.ఎస్. స్వామినాథన్ పరిశోధనా సంస్థ బృందం పారిశుధ్య నిర్వహణపై అధ్యయనం
ఆయుధం న్యూస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల సేకరణ, వేరు చేయడం, ప్రాసెసింగ్ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఎం.ఎస్. స్వామినాథన్ పరిశోధనా సంస్థ (MSSRF) – చెన్నై బృందం రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పర్యటించారు. ఈ సందర్భంగా మునిసిఫల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్.వెంకన్నతో MSSRF బృందం సమావేశమైంది. నగరంలో అమలవుతున్న పారిశుధ్య నిర్వహణ విధానాలు, ఇంటింటి నుంచి వ్యర్థాల సేకరణ, తడి–పొడి వ్యర్థాల వేరు సేకరణ, స్వచ్ఛ...