AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 3:13 pm Posted by : AYUDAM DAILY

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఫొటో జర్నలిస్టులకు సన్మానం

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌
ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఫొటో జర్నలిస్టులను ప్రెస్ క్ల‌బ్ కార్య‌వ‌ర్గం స‌భ్యులు ఘనంగా సన్మానించారు.గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఫొటో జర్నలిస్టులను శాలువాతో సన్మానించి మెమోంటో అందించటంతో పాటుగా ప్రతీ ఫొటో జర్నలిస్టుకు రెండు వేల‌ రూపాయల నగదు పారితోషికాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బోల్ల అమర్, ఉపాధ్యక్షులు గొకారపు శ్యాం, కొడిపెల్లి దుర్గాప్రసాదరావు, జాయింట్ సెక్రెటరీలు పొడిచెట్టి విష్ణువర్ధన్, వలిశెట్టి సుధాకర్, సంపెట సుధాకర్, కార్యవర్గ సభ్యులు వీరగోని హరీష్, ఎండీ నయీంపాషా, ఫొటో గ్రాఫర్లు దాసరి శ్రీనివాస్, మంగనూరి మురళి,గొట్టె వెంకన్న, చేతి శ్రీనివాస్, కుడుతుల రమేష్, మాషూక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.