భవన నిర్మాణ నిబంధనలు పాటిస్తేనే అనుమతులు

ఆయుధం న్యూస్ వరంగ‌ల్ భవన నిర్మాణ నిబంధనలను ఖచ్చితంగా పాటించినప్పుడే అనుమతులు మంజూరు చేస్తామని, అనుమతించిన నిర్మాణ ప్రణాళిక (శాంక్షన్డ్ ప్లాన్) ప్రకారమే భవనాలు నిర్మించిన వారికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ) జారీ చేస్తామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న స్పష్టం చేశారు.గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను కమిషనర్ క్షేత్రస్థాయిలోస్వయంగా బుధవారంపరిశీలించారు. హంటర్ రోడ్, ప్రకాశ్‌రెడ్డి పేట, నక్కలగుట్ట, జూలైవాడ, ఎక్సైజ్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, నిర్మాణాలను...