కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి

ఆయుధం న్యూస్ హైద‌రాబాద్ గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య కోరారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో జనరల్ మేనేజర్‌ను స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను, ఈ ప్రాంతానికి ఉన్న రైల్వే ప్రాధాన్యతను జీఎంకు వివరించారు. కాజీపేట జంక్షన్ దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత కీలకమైన జంక్షన్‌గా ఉన్నప్పటికీ, దానికి తగిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని వరంగల్...