AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 9:00 pm Posted by : AYUDAM DAILY

గడ్డం వెంకన్నకు సన్మానం

ఆయుధం న్యూస్ హన్మకొండ
తెలుగు విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న గడ్డం వెంకన్న ప్రొఫెసర్ గా పదోన్నతి పొందిన సందర్భంగా తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం, TPUS వరంగల్ జిల్లా తరఫున వారిని రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో  వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం రాజమౌళి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బొద్దుల.వెంకటేశ్వర్లు,జిల్లా ప్రచార కార్యదర్శి కోడూరి రమేష్, భాసాని సురేష్  తదితరులు పాల్గొన్నారు.