ఆయుధం న్యూస్ హనుమకొండ
టీచర్స్ కు రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలనీ మాస్టర్ జి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ,కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు.నల్గొండ నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపరెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తూ హనుమకొండలోని అదాలత్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, టీచర్స్ పాల్గొన్నారు. రూపారెడ్డి మరణం కాదు.విద్యావ్యవస్థకు హెచ్చరిక అని ముక్తకంఠంతో ప్రైవేట్ టీచర్స్ ఖండించారు. మాస్టర్ జి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ,కూడా మాజీ చైర్మన్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ ప్రిన్సిపాల్ రూపరెడ్డి ఫ్యామిలీకి సంఘీభావం తెలపడానికి నిరసన ర్యాలీ చేపట్టామన్నారు. తల్లితండ్రుల తర్వాత గురువులనే దైవంలాగా భావిస్తాం..దైవంలాంటి గురువులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక రోజు స్పందించడం వదిలేయడం కాకుండా కఠిన చర్యలు ఉండాలన్నారు..రాబోయే రోజులలో ఏ టీచర్ కు రూపారెడ్డి పరిస్థితి రావద్దంటే తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలను కాపాడేందుకు ప్రత్యేక యాక్ట్ తో సహా రూపరెడ్డి ఫ్యామిలీకి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ స్కూల్స్ తో సహా టీచర్స్ పై ఎలాంటి దాడులు జరగకుండా రక్షణ ఉండేలా చూడాలనీ ప్రభుత్వాలను సుందర్ రాజ్ యాదవ్ కోరారు..ఈ కార్యక్రమంలో వాడుప్సా నాయకులు ఎన్.రమేష్, ఎన్.నారాయణరెడ్డి, నాగార్జున రెడ్డి, సతీష్ కుమార్, జ్ఞానేశ్వర్, ముక్తేశ్వర్, శ్రీధర్, జి.రమేష్, రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు