ఆయుధం న్యూస్ హన్మకొండ
సంచార జాతులకు సంబంధించిన సమస్యలను తెలియజేసినచో వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.హన్మకొండ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జె. రంగారెడ్డి ఆధ్వర్యంలో సంచార జాతుల విముక్తి ఉత్సవం సందర్భంగా సోమవారం హనుమకొండలోని కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారుఈ సందర్భంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, అంబేద్కర్ చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి, తదితరులు పూలమాలలు వేశారు.అనంతరం మాట్లాడుతూ. సంచార జాతులకు సంబంధించిన సమస్యలను తెలియజేసినచో.వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ బీసీ కుల సంఘ నాయకులు, సంచార జాతి నాయకులు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో ఎస్. లక్ష్మణ్ , ఆర్. సంపూర్ణ, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.